Chandrababu Naidu: ‘ప్రజాకోర్టు’ పేరుతో టీడీపీ ఛార్జ్‌షీట్ విడుదల.. చంద్రబాబు ఏమన్నారంటే?
ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ..

Chandrababu Slams YS Jagan
ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకంమని అన్నారు. ‘ప్రజాకోర్టు’ పేరుతో టీడీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా విమర్శించారు.
ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నారని అన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల భారం మోపారని చెప్పారు. మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారని అన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశారని చెప్పారు.
Pawan Kalyan: జగన్ తనను తాను ఇలా పోల్చుకోవడం హాస్యాస్పదం: పవన్ పవర్‌ఫుల్ స్పీచ్