Chandrababu Naidu: ఏపీలోని ప్రాజెక్టులను సందర్శించనున్న చంద్రబాబు.. రూట్ మ్యాప్ ఇదే
మొదటిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, అనంతరం నందికొట్కూరులో రోడ్ షో నిర్వహిస్తారు.

Chandrababu
Chandrababu Naidu – Projects: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ‘పెన్నా నుంచి వంశధార’ (Penna to Vamsadhara projects) పేరుతో చేయనున్న ఈ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైంది.
చంద్రబాబు ఆగస్టు 1 నుంచి తన పర్యటనలను మొదలు పెట్టనున్నారు. మొదటిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, అనంతరం నందికొట్కూరులో రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును సందర్శిస్తారు.
అదే రోజు పులివెందుల, పూల అంగళ్ల సర్కిల్ వద్ద ప్రసంగిస్తారు. ఆగస్టు 3 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటన ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్లను సందర్శిస్తారు.
అలాగే, కియా కార్ల పరిశ్రమను పరిశీలిస్తారు. ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభమవుతుంది. పలమనేరు బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించి, అనంతరం పూతలపట్టులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆగస్టు 10 వరకు చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శిస్తారు.
Bus Video: బస్సులో మంటలు.. 50 మంది ప్రయాణికులు వెంటనే అందులోంచి..