Chandrababu Naidu : ప్రజల్లోకి చంద్రబాబు.. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన, ప్రతి ఇంటిని సందర్శించేలా ప్రణాళిక
వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా అక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. Chandrababu - TDP

Chandrababu - TDP
Chandrababu – TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా పవర్ లో రావాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.
అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రజల్లోకి నేతలు పెద్ద ఎత్తున వెళ్లేలా కార్యాచరణ ప్రారంభించబోతున్నారు చంద్రబాబు. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా అక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Also Read..Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ సీనియర్ నేతలు, స్టేట్ కమిటీలో ఉన్న నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఈ సమావేశం జరుగుతోంది అని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ కూడా లాంచ్ చేయబోతున్నారు. దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇప్పటికే బాదుడే-బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. అలాగే నేతల పనితీరుపైనా బేరీజు వేయనున్నారు. ఇంచార్జ్ ల పనితీరును సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికల వేళ మరింత ఉత్సాహంగా పని చేసేలా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.
Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?