Chandrababu Naidu : ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు.. పోలీసుల తీరుపై అసంతృప్తి!
Chandrababu Naidu : ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని స్పష్టం చేశారు.

Chandrababu Naidu ( Image Credit : Google )
Chandrababu Naidu : దేశీయ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం (జూన్ 7)న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీలతో కలసి ఈరోజు (గురువారం) సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై టీడీపీ అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.
అయితే, చంద్రబాబు ఆదేశాలను గుంటూరు, విజయవాడ, పోలీసు ఉన్నతాధికారులకు ఆయన భద్రతా సిబ్బంది తెలిపింది. చంద్రబాబు ఇవాళ ఢిల్లీ బయల్దేరే ముందు చుట్టుపక్కల ట్రాఫిక్ మళ్లీ ఆపేశారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ మరోసారి ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబుతో పాటు ఢిల్లీకి తెలుగుదేశం ఎంపీలు కూడా వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
Read Also : డిమాండ్ల సాధనకు, రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ఎంపీలకు ఇదే మంచి అవకాశం..!