Chandrababu : ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన!
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.

Chandrababu Naidu
Chandrababu : ఈ నెల 22న (నవంబర్) చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయలసీమ జిల్లాలతో సహా నెల్లూరులోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయని తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలన్నారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందేలా చూడాలన్నారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేసినట్టు చెప్పారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని చంద్రబాబు సూచనలు చేశారు. అలాగే వరద బాధితులకు టీడీపీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Also : Farmers Tractor March : తగ్గేదే లే..పార్లమెంట్ కు రైతుల ట్రాక్టర్ మార్చ్!