Chelluboyina Venugopalakrishna: విశాఖ నుంచి పాలన ఎప్పుడనేది జగన్ త్వరలోనే చెబుతారు.. అంతేగానీ..
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ చెప్పారు.

Chelluboyina Venugopal
Chelluboyina Venugopalakrishna: విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) త్వరలోనే చెబుతారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ చెప్పారు. దసరా నుంచి విశాఖలో పాలన అని కేబినెట్లో జగన్ అనలేదని తెలిపారు. విద్యారంగంలో జగన్ పెను మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల నుంచి స్పందన లేదని చెప్పారు.
ఓ సినీనటుడు వచ్చి, ములాఖత్ అంటూ మిలాఖత్ అయిపోయారని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు మొత్తం తొమ్మిది కేసులపై స్టే తెచ్చుకున్నారని చెప్పారు. ఐటీలో బీసీ విద్యార్థులు చంద్రబాబు వల్ల నష్టపోయారని అన్నారు.
Venkaiah Naidu : నేటి సినిమా మేకర్స్ పై వెంకయ్య నాయుడు విమర్శలు.. డబల్ మీనింగ్ డైలాగ్స్..