Narayana Arrest : నారాయణ అరెస్టును ధృవీకరించిన చిత్తూరు పోలీసులు

హైదరాబాద్‌లో కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం (మే10,2022) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు.

Narayana Arrest : నారాయణ అరెస్టును ధృవీకరించిన చిత్తూరు పోలీసులు

Narayana

Narayana arrest : టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే నారాయణ అరెస్టును చిత్తూరు పోలీసులు ధృవీకరించారు. టెన్త్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఉదయాన్నే హైదరాబాద్ లో నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకెళ్తున్నారు. ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం (మే10,2022) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ కేసుతోపాటు, అమరావతి రాజధాని భూముల CRDA కేసులో కూడా నారాయణ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో విచారణ కోసం నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై నారాయణను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది.

TDP Leader Narayana : ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..!

టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజ్‌ కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు అయింది. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు కృష్ణా జిల్లా మండవల్లిలో సీఐడీ కేసులు నమోదు చేసింది. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌ నెంబరు 111/2022 కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మండవల్లిలో ఈ నెల 2వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 141/2022 కింద కేసు నమోదు చేశారు.

ఇప్పటికే చిత్తూరు కేసులో నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణతో పాటు ఆయన సతీమణికి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర ఉంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో తెల్లవారు జామున హైదరాబాద్‌లో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టం 408 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.