Andhra Pradesh : విజయవాడ జింఖానా గ్రౌండ్ స్మిమ్మింగ్ పూల్లో క్లోరిన్ లీక్ .. 10 చిన్నారులకు అస్వస్థత
విజయవాడ జింఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ లీక్ అవ్వటంతో 10మంది చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Illness Of Children In Vijayawada Gymkhana Ground Swimming Pool
Andhra Pradesh : విజయవాడ జింఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ లీక్ అవ్వటంతో 10మంది చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు.దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
డిసెంబర్ (2022)11న ఏలూరులో జరగనున్న స్విమ్మింగ్ పూల్ పోటీలకు చిన్నారులు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా జింఖానా గ్రౌండ్ లోఉన్న స్మిమ్మిగ్ పూల్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 10మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. క్లోరిన్ సిస్టమ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.