Chandrababu Custody : చంద్రబాబు కస్టడీ పొడిగింపు..? ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న సీఐడీ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 5రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరగా.. ఏసీబీ కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. Chandrababu Custody

Chandrababu CID Custody (Photo : Google)
Chandrababu Custody – CID : చంద్రబాబు కస్టడీ పొడిగించాలని సీఐడీ కోరనుంది. నేటితో కస్టడీ ముగుస్తుండటంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది సీఐడీ. మరో మూడు రోజులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ఈ విచారణకు చంద్రబాబు సహకరించారో లేదో అన్న దానిపై నివేదికను సీల్డ్ కవర్ లో పెట్టి ఇవ్వాలని కోర్టు కోరింది. ఈ సాయంత్రం చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఉంది.
కాగా, నేటితో(సెప్టెంబర్ 24) చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్, రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగుస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 5రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరగా.. ఏసీబీ కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. నిన్న(సెప్టెంబర్ 23), ఇవాళ(సెప్టెంబర్ 24) సీఐడీ అధికారులు రాజమండ్రి జైల్లో చంద్రబాబుని విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు.