Pulichintala Project : పులిచింతల ప్రాజెక్టు వద్ద పూర్తైన స్టాప్ లాక్ గేట్ల బిగింపు
పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్ లాక్ గేట్ పనులు పూర్తయ్యాయి. విరిగి పడిన 16 వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ను నిపుణులు అమర్చారు.

Pulichinthala
pulichintala stop lock gates : పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్ లాక్ గేట్ పనులు పూర్తయ్యాయి. విరిగి పడిన 16 వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ను నిపుణులు అమర్చారు. 11 స్టాప్ లాక్ గేట్లకు గానూ 11 గడ్డర్స్ ను దింపారు. పైనుంచి వస్తున్న నీటిని పులిచింతల ప్రాజెక్టులో అధికారులు నిల్వ చేస్తున్నారు.
గురువారం (ఆగస్టు 5, 2021)న పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతలో గేటు ఎత్తుతుండగా ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు సాంకేతిక సమస్య కారణంగా ఊడి నీటిలో పడిపోయింది.
ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. సాంకేతిక సమస్యతో గేటు ఊడి నీటిలో పడిపోయింది.
ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో ఒక్క 16 వ నెంబర్ గేటు ద్వారానే అదనంగా దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. నాలుగు రోజులు శ్రమించి స్టాప్ లాక్ గేట్లను బిగించారు.