AP Elections 2024: జనసేన సీట్ల వాటాపై క్లారిటీ వచ్చినట్టేనా? పవన్ కల్యాణ్ పార్టీకి ఈ సీట్లు?
సీట్ల పంపకాల్లో భాగంగా జనసేన 23 చోట్ల పోటీచేయడానికి సిద్ధమవగా, అదనంగా..

JanaSena
టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాట్లు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేయబోయే స్థానాలపై ఇరుపార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. ఆదివారం టీడీపీ-జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగాక.. జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్యపై స్పష్టత రాగా, ఇప్పుడు ఏయే నియోజకవర్గాల్లో పోటీచేయాలన్న అంశంపైనా క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ సీట్ల పంపకాల్లో భాగంగా జనసేన 23 చోట్ల పోటీచేయడానికి సిద్ధమవగా, అదనంగా మరికొన్ని సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. గెలుపే ప్రాతిపదికగా జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలపై 10 టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్…
- విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల లేదా గజపతినగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ
- జనసేనకే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం
- విశాఖ దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో ఒకటి జనసేనకు కేటాయింపు
- చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలిల్లో జనసేన పోటీ
- పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి.గన్నవరం, రాజానగరం జనసేనకు ఫిక్స్
- రాజమండ్రి రూరల్ లేదా తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకవర్గం
- అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు జనసేనకు..
- ఏలూరు లేదా కైకలూరు, తెనాలి, దర్శి లేదా చీరాల నియోజక వర్గాలు జనసేనకే..
- పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరుల్లో జనసేన పోటీ
AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?