వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి- మంత్రులను హెచ్చరించిన చంద్రబాబు

అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.

వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి- మంత్రులను హెచ్చరించిన చంద్రబాబు

Cm Chandrababu Naidu : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సీఎం చంద్రబాబు మంత్రులతో తొలిసారి భేటీ అయ్యారు. పరిపాలనకు సంబంధించి మంత్రులకు కీలక సూచనలు చేశారు. అలాగే పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం కూడా చేశారు. మంత్రులతో భేటీ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగా ఉన్న పరిస్థితి, ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారాయన.

జగన్ నాశనం చేసిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అన్నారు. ఇక.. ఓఎస్డీలు, పీఎలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రులతో చెప్పారు. గత ప్రభుత్వంలో కళంకిత మంత్రుల వద్ద పని చేసిన వారు ఇప్పుడు మీ వద్ద దూరే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని మీ దరి చేరనివ్వద్దని చంద్రబాబు చెప్పారు.

శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామని చంద్రబాబు అన్నారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్ధత బట్టి రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని వెల్లడించారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని మంత్రులతో తేల్చి చెప్పారు చంద్రబాబు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.

Also Read : హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ