Cm Chandrababu : వైసీపీ పాలనలో అమరావతిని భ్రష్టు పట్టించారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు- సీఎం చంద్రబాబు

మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.

Cm Chandrababu : వైసీపీ పాలనలో అమరావతిని భ్రష్టు పట్టించారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు- సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

Updated On : January 16, 2025 / 11:37 PM IST

Cm Chandrababu : ఏపీకి పోలవరం జీవనాడి అన్న సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం అమరావతి సహా పోలవరాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. గత పాలకుల పాలన వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. వెల్త్, హెల్త్, హ్యాపీ ఫ్యామిలీనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్న సీఎం చంద్రబాబు.. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతిని భ్రష్టు పట్టించారు.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు..
”వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయి. ఒకపక్క అమరావతి, పోలవరం.. అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు. భ్రష్టు పట్టించారు. పోలవరం ఏపీకి ఒక లైఫ్ లైన్. జీవనాడి. అలాంటి పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు.

సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతాం..
సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని నేను చాలా సందర్భాల్లో చెప్పా. చాలామంది విమర్శలు చేశారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది.

Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త.. 11,500 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజీ

ఐటీ అంటే నవ్వారు..
నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను. ఐటీ వల్ల ఏం జరుగుతోందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్ షిప్ తీసుకుని చాలామంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ, ఐటీ తిండి పెడతాయా అన్నారు. ఈరోజు ఐటీ తిండి పెట్టడం కాదు కానీ, ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకుపోతోంది. సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆరోజు చేశాం.

3H లక్ష్యంగా..
నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విజన్ తో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. అదే నా లక్ష్యం. అందుకే పీ4 అన్నాను. జీరో పావర్టీ. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు నిరంతరం పని చేయడం.

గేమ్ ఛేంజర్..
పీ4 అనేది ఒక గేమ్ ఛేంజర్ గా తయారవుతుంది. పీ3- వెల్త్ ను క్రియేట్ చేయడంలో ఓ గేమ్ ఛేంజర్. సంపద సృష్టించడానికి పీ3 పని చేసింది. పీ4 అనేది జనాభాను ఒక ఆస్తిగా తీసుకుని అందరినీ ఎంఫోర్ మెంట్ చేసి వాళ్ల శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్లని ఆర్థికంగా పైకి తీసుకొస్తే.. అదే బెస్ట్ సొసైటీ ఈ ప్రపంచంలో” అని సీఎం చంద్రబాబు అన్నారు.

 

Also Read : దమ్ముంటే రా.. లై డిటెక్టర్ టెస్ట్ పై సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..