Cm Chandrababu : ముఖ్యమంత్రిగా పని చేసిన 3సార్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఉన్నాయి- సీఎం చంద్రబాబు
ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు..

Cm Chandrababu : Cm Chandrababu : గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రంలో భారీ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. గతంలో తాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో పోలిస్తే.. ఈసారి అంతకు మించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లు చంద్రబాబు వాపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేసేది లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు.
గత 6 నెలల నుంచి రాత్రి పగలు ఆలోచిస్తూ పట్టుదలగా పరిశోధిస్తున్నా జరిగిన విధ్వంసానికి దారి దొరకట్లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టను అని స్పష్టం చేశారు. నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం ఉన్నా ఆ వెసులుబాటు లేదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుంది..
ముఖ్యమంత్రిగా పని చేసిన 3 సార్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని చెప్పారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని మేం పూర్తి చేసి తీరతామన్నారు చంద్రబాబు.
గత పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు..
గత ఐదేళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు చంద్రబాబు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్ధిక సాయం ప్రారంభించింది మేమే అని చెప్పారాయన. క్రైస్తవ స్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత పాలకులు క్రైస్తవ అనుబంధ కళాశాలలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
Also Read : విశాఖలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు.. ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్న కీలక నేతలు..
క్రైస్తవులకు జగన్ ఏం చేశాడో ఏనాడైనా అడిగారా?- ఎన్ఎండీ ఫరూఖ్, మంత్రి..
జగన్ మా వాడు మా వాడు అనుకున్న క్రైస్తవులు.. క్రైస్తవులకు జగన్ ఏం చేశాడో ఏనాడైనా అడిగారా? ఉమ్మడి ఏపీలోనూ, ఇప్పుడూ క్రైస్తవులకు చంద్రబాబు ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పాస్టర్లకు డబ్బులిచ్చేoదుకు బడ్జెట్ లో నిధులు కూడా చంద్రబాబు పెట్టారు. క్రైస్తవులకు అసలైన సంక్షేమం ఎవరు ఇచ్చారో ఆలోచన చేయాలి. క్రైస్తవుల్లోనూ మార్పు రావాలి, పాలకుల్లోనూ మార్పు రావాలి. ఆలోచనల్లో మార్పు తెచ్చుకుని ఒకే కుటుంబంగా ముందుకు సాగుదాం. రాష్ట్రాభివృద్ది కోసం అంతా కలిసి ప్రార్ధన చేద్దాం.
క్రీస్తు తత్వాన్ని అనుసరించే ముఖ్యమంత్రి మన చంద్రబాబు- రఘురామ కృష్ణరాజు, ఉప సభాపతి
క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని అనుసరించే ముఖ్యమంత్రి మన చంద్రబాబు. ప్రేమను పంచి, పగను తుంచాలని క్రీస్తు సూక్తిని పాటించే నాయకుడు మన చంద్రబాబు. నూతన సంవత్సరo వచ్చే వరకూ క్రిస్మస్ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహిద్దాం.
Also Read : లుంగీ కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్- కడప మేయర్‌పై ఎమ్మెల్యే మాధవి ఫైర్