Cm Chandrababu: ఏపీకి ఏకైక రాజధాని అమరావతి, ఇక ఎవరూ ఇంచు కూడా కదిలించలేరు- సీఎం చంద్రబాబు
ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గు పడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు.
Cm Chandrababu: వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని తేల్చి చెప్పారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. స్వర్ణాంధ్ర సాధన కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన కొనసాగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీది మూడు ముక్కలాట అని విమర్శించారు. రాజధాని అమరావతిపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెడితే సభకు హాజరుకాలేదని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
”నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదు. వైసీపీ పాలనలో మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసమే. బటన్ నొక్కే కార్యక్రమం పేరుతో ఉత్తుత్తి బటన్స్ నొక్కే వారు. నేను ఎవరినీ బలవంతం చేయలేదు. మీరు స్వచ్చందంగా ఇంత పెద్దఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం వెంటనే ఆమోదిస్తామని చెప్పింది. నేను ఆఘమేఘాల మీద అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అదొక రాజకీయ పార్టీయేనా?
ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గు పడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. కేంద్రం బిల్లు పెట్టింది. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే. నేను కానీ మీరు కానీ ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పెత్తందారులు కాదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: ‘అమరావతికి అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు YCP వ్యతిరేకం కాదు.. మండలికి పిలవాలి కదా’ : YS జగన్
