Cm Chandrababu: వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని మనమూ వారిలానే వేధించటం కరెక్ట్ కాదు- సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.

Cm Chandrababu: వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని మనమూ వారిలానే వేధించటం కరెక్ట్ కాదు- సీఎం చంద్రబాబు

Updated On : June 4, 2025 / 4:56 PM IST

Cm Chandrababu: సీఎం చంద్రబాబుతో సమావేశంలో మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకులను జైలుకు పంపారని సంధ్యారాణి గుర్తు చేశారు. మంత్రుల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని మనమూ వారిలానే వేధించటం సరికాదని హితవు పలికారు చంద్రబాబు.

గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించటమే మన విధానం అన్న చంద్రబాబు.. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని తేల్చి చెప్పారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.

Also Read: నేరస్తులకు అండగా నిలవడం ఏంటి? రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న సీఎం చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని, ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కూడా జరుగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతిలో చేపట్టే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లు చూడాలని పవన్ కల్యాణ్ ను కోరారు చంద్రబాబు. తిరుపతిలో సినీతారలతో యోగా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 15వ తేదీని ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.