ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌.. ఏం జరిగింది?

వైసీపీ ఓటమిలో ఇసుక, మద్యం కారణం అయ్యాయని అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌.. ఏం జరిగింది?

Cm Chandrababu Naidu

Updated On : October 18, 2024 / 7:58 PM IST

ఎమ్మెల్యేలతో చంద్రబాబు మీటింగ్ అంటే.. రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనించింది. లిక్కర్‌, ఇసుక వ్యవహారంలో పార్టీ నేతలు హద్దులు దాటుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. చంద్రబాబు ఏం చెప్తారు.. ఎలా చెప్తారు.. ఎవరికి చెప్తారంటూ.. మీటింగ్‌కు ముందు నుంచి కనిపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. వైసీపీ ఓటమిని పాఠంగా చెప్పారు.. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలన్నారు.. ఇంతకీ మీటింగ్‌లో ఏం జరిగింది.. వదిలేది లేదు అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..

పార్టీ ప్రజాప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు మీటింగ్ తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివి. ఎంతోమంది నాయకులను తెలుగు రాష్ట్రాలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. క్రమశిక్షణకు కేరాఫ్ అని ఓ పేరు కూడా ఉంది. అలాంటిది పార్టీలో పరిస్థితులు మారుతున్నాయ్‌. నేతల తీరు పార్టీని ఇబ్బంది పెట్టే పరిణామాలు ఉన్నాయని.. పార్టీలోనే చర్చ జరుగుతోంది.

దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో.. ఏం చేస్తే తనేం చేయాల్సి ఉంటుందో.. పరోక్షంగా కొందరికి, ప్రత్యక్షంగా కొందరికి స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. మనం ఇప్పుడు ప్రవర్తించే విధానంతోనే వచ్చేఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.

కక్ష సాధింపులకు వెళ్లడం కరెక్ట్ కాదంటూ..
ఎన్ని అరాచకాలు చేయకపోతే… 151 సీట్లు వచ్చిన వైసీపీ 11 స్థానాలకు పడిపోయిందో ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దని, అలా అని కక్ష సాధింపులకు వెళ్లడం కరెక్ట్ కాదంటూ.. ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎట్‌ ది సేమ్ టైమ్‌.. పిక్చర్ అభీ బాకీ హై అన్నట్లు వైసీపీకి, జగన్‌కు ఇన్‌డైరెక్ట్‌ వార్నింగ్ ఇచ్చారు.

ఇక అటు జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారని జాగ్రత్తలు చెప్తూనే.. వైసీపీ ఓటమే మనకు పాఠం అన్నట్లు.. నేతల్లో ఆలోచన తీసుకువచ్చారు. లాజికల్‌గా చెప్తూనే.. హద్దులు దాటితే తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా చంద్రబాబు ఈ మీటింగ్‌లో చెప్పిన మాటలు.. టీడీపీ క్షేత్రస్థాయి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతూనే.. నేతలను అప్రమత్తం చేస్తున్నాయ్.

పార్టీకీ పెద్ద తలనొప్పిగా కొందరు నేతల తీరు
నిజానికి ఈసారి కూటమికి దక్కిన విజయం మాములుది కాదు. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో అధికారంలోకి వచ్చింది. చరిత్ర గుర్తుంచుకునే విజయం ఇది. ఐతే పార్టీ అధికారంలోకి వచ్చాక కొందరు నేతల తీరు పార్టీకీ పెద్ద తలనొప్పిగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన వివాదాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా ఇసుక, మద్యం టెండర్ల విషయాల్లో ఎమ్మెల్యేల తీరు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. నేతలను పిలిచి.. సూచనలతో పాటు వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ఓటమిలో ఇసుక, మద్యం కారణం అయ్యాయని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి ఇష్యూలో ఇప్పుడు తమ్ముళ్లు తలదూర్చి వివాదాలు క్రియేట్‌ చేయడం… పార్టీని డ్యామేజీ చేసే ప్రమాదం ఉంది. అందరికీ హితబోధ చేస్తూనే.. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

కార్యకర్తల కష్టాన్ని గుర్తుచేస్తూనే.. ఆ కష్టాన్ని గుర్తుచేసుకుంటామని చెప్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపుతున్నాయ్. మరి చంద్రబాబు క్లాస్ తర్వాత టీడీపీ నేతల తీరులో మార్పు వస్తుందా లేదో చూడాలి మరి.

Gold: ఊహించని విధంగా ఎదురయ్యే ఈ 9 దుస్థితుల నుంచి.. ‘బంగారం’తో ఇలా బయటపడండి..