Cm Chandrababu: నన్నే మోసం చేశారు, ఆరోజే అందరినీ జైల్లో పెట్టి ఉంటే.. మనం ఓడిపోయే వాళ్లమా?- సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

దొంగలు, నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. కానీ, ఆ రోజు నా టైమ్ బాగోలేదు. నేను కూడా నమ్మాను.

Cm Chandrababu: నన్నే మోసం చేశారు, ఆరోజే అందరినీ జైల్లో పెట్టి ఉంటే.. మనం ఓడిపోయే వాళ్లమా?- సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

Updated On : June 16, 2025 / 11:04 PM IST

Cm Chandrababu: రాజకీయం అంటే తమాషా కాదన్నారు సీఎం చంద్రబాబు. మోసాలు, నేరాలు చేసి రాజకీయం చేయకూడదన్నారు. విశాఖలో యోగా డే ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 2019లో వివేకా హత్య కేసులో నన్నే మోసం చేశారు అంటూ పరోక్షంగా జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆ రోజే అందరినీ జైల్లో పెట్టి ఉంటే.. మనం ఓడిపోయే వాళ్లమా? అని కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

”తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి, నేరాలు చేసి ఎదుటి వాళ్ల మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం. 2019. తెల్లవారితే బాబాయ్ లేచిపోయాడు. బాబాయ్ కి గుండెపోటు అని చెప్పారు. అది చూసి నేను కూడా నమ్మేశాను. నిజానికి నేను ఎప్పుడూ నమ్మను.

దొంగలు, నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. టైమ్ బాగోలేదు. నేను కూడా నమ్మాను. ఆరోజు కానీ నేను కరెక్ట్ గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టి ఉంటే మనం ఓడిపోయే వాళ్లమా అని అడుగుతున్నా. ఆరోజు సునీత వివేకా కూతురు.. నాకు అనుమానం ఉంది, పోస్టుమార్టం చేయమని అడిగింది. పోస్టుమార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని పోస్టుమార్టంలో తేలింది. అదే సాయంత్రానికి ఈ నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు.

Also Read: మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ..

మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ని కూడా చంపేశారు అంటే ప్రజలు నమ్మారు. బాబాయ్ ని చంపే ధైర్యం మీకు ఎవరికైనా ఉందా? చంపేసి మీ సీఎం మీదో, మీ ఎంపీ పైనో, మీ మంత్రిపైనో తోసేయగలరా? అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్లీ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూశాం. కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకం చూపించాడు. ఇంకా చూపిస్తున్నాడు. ఇక గులకరాయి. మొన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం అన్నారు. ఇలా ఎన్నో నాటకాలు ఆడారు” అంటూ జగన్ పై ధ్వజమెత్తారు చంద్రబాబు.