సీఎం జగన్ కొత్త పథకం : ప్రతి ఏటా రూ.20వేలు

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 08:29 AM IST
సీఎం జగన్ కొత్త పథకం : ప్రతి ఏటా రూ.20వేలు

Updated On : January 9, 2020 / 8:29 AM IST

ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. అదే ”జగనన్న వసతి దీవెన” పథకం. ఈ స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలో రూ.10వేలు.. జూలై, ఆగస్టు నెలలో రూ.10వేలు జమ చేస్తామన్నారు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదని సీఎం అన్నారు. ఇక జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద డిగ్రీ చదివే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొస్తామన్నారు. 

చిత్తూరులో గురువారం(జనవరి 9,2020) జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలో ఏటా రూ.15వేలు వేస్తామన్నారు సీఎం జగన్. దేశ చరిత్రలో అమ్మఒడి లాంటి స్కీమ్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం జగన్ చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం తీసుకురాలేదన్నారు.

పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశ పెడతామన్నారు. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని జగన్ చెప్పారు. తెలుగు మీడియం కచ్చితంగా కావాలనే పెద్ద సినిమా స్టార్ సహా నేతలెవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించరని సీఎం జగన్ విమర్శించారు.

* పిల్లలను బడులకు పంపే తల్లులకు సీఎం జగన్ కానుక
* అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన జగన్
* అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన వరం
* మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడిని అమలు చేస్తున్నాం
* అమ్మఒడితో 43లక్షల మంది తల్లులకు లబ్ది
* 82లక్షల మంది విద్యార్థులకు మేలు
* చదువనేది పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి
* 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు చదువుకోడం ప్రాథమిక హక్కు
* పెద్ద సినిమా యాక్టర్ కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు

* జూన్ 1 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధన
* తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉంటుంది
* పెద్ద సినిమా స్టార్ సహా నేతలెవరూ వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చదివించరు
* 42లక్షల 12వేల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.6వేల318 కోట్లు జమ చేస్తాం
* ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలకు అమ్మఒడి వర్తింపు

* ఈ ఏడాది 75శాతం హాజరు నిబంధన మినహాయింపు
* 2021 నుంచి 75శాతం హాజరు నిబంధన తప్పనిసరి
* నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు రూ.15వేలు బదిలీ
* పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ఇంగ్లీష్ మీడియం
* డిగ్రీ విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన
* విద్యార్థుల చదువు, భోజనం, హాస్టల్ ఖర్చు కోసం ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం
* విద్యా దీవెన పథకం కింద పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్