నిమ్మల డ్రామానాయుడు… సీఎం జగన్ సెటైర్లు

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 12:46 PM IST
నిమ్మల డ్రామానాయుడు… సీఎం జగన్ సెటైర్లు

Updated On : December 3, 2020 / 2:05 PM IST

CM Jagan fire MLA Nimmala Ramanayudu : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామానాయుడు డ్రామా నాయుడుగా మారారని సెటైర్లు వేశారు. నిమ్మల అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. రామానాయుడుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొదన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.



పెన్షన్లపై సభను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సభలో రోజూ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రామానాయుడుపై ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదించారు.



టీడీపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బాబు అబద్ధాలు అడుతూ తన సభ్యులను కూడా తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.