Jagananna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. కిట్లలో విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే..

పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. కిట్లలో విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే..

Jagananna Vidya Kanuka

Jagananna Vidya Kanuka : పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.

‘జగనన్న విద్యా కానుక’ పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలో నోట్‌ బుక్స్, షూ, బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌‌తో పాటు ఇంగ్లిష్-తెలుగు డిక్షనరీ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 47.32 లక్షల మందికిపైగా విద్యార్ధులకు 2021-22 విద్యా సంవత్సరానికి రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జగనన్న గోరుముద్ద పథకం కోసం 2021-22లో రూ.1,625 కోట్లు, మనబడి ‘నాడు–నేడు’ రెండో విడత కోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

విద్యారంగంతో పాటు వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, స్టీల్‌ప్లాంట్‌ తదితరాలను కూడా సీఎం జగన్‌ సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నైపుణ్యాభివృ‌ద్ది కాలేజీలకు సంబంధించిన పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌ వాటర్‌ గ్రిడ్‌ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్మాణంపై మరింతగా దృష్టిపెట్టాలని సూచించారు. అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టి పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..