స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సీఎం జగన్ మీటింగ్, కార్మికుల డిమాండ్స్

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సీఎం జగన్ మీటింగ్, కార్మికుల డిమాండ్స్

Updated On : February 17, 2021 / 2:19 PM IST

Visakha steel plant employees : సీఎం జగన్‌ విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంకు వినతిప్రతం సమర్పించింది. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమించాలని కోరింది. తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ మైన్స్‌ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరింది. ప్రకాశం జిల్లాలో 66 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్‌ ఓర్ గనులను స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలని కమిటీ సభ్యులు సీఎంను కోరారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్న సమయంలో.. కార్మిక సంఘాల నేతలు ఏపీ సీఎం జగన్‌తో బేటీ అయ్యారు. విశాఖ వెళ్లిన సీఎం జగన్‌ను కార్మిక సంఘాల నాయకులు ఎయిర్‌పోర్టులోనే కలిసారు. ఈ సందర్భాంగా పలు అంశాలపై చర్చించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందించారు నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కార్మిక సంఘాల అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు జగన్‌ను మూడు పేజీల లేఖను ఇచ్చారు. అందులో తమ డిమాండ్లేంటి అనే విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మికుల తొలి డిమాండ్‌గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ మైన్స్‌ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలిని విజ్ఞప్తి చేశారు. అలాగే… ప్రకాశం జిల్లాలో 66 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్‌ ఓర్ గనులను స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలోని ఏ గనైనా కనీసం 2 వేల ఏళ్లపాటు లీజుకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలు ఆ లేఖలో కోరారు.