CM Jagan : జగనన్న తోడు పథకం నిధులు.. విడుదల చేయనున్న సీఎం జగన్
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

Jagananna Thodu Scheme
Jagananna Thodu Scheme Funds : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న తోడు పథకం నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించే ఈ పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ (మంగళవారం) విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికీ రూ.10 వేల రూపాయల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణం లభించనుంది.
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది 51 లక్షల మందికి 510 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నారు.
NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు
వడ్డీ మాఫీ కింద 4 లక్షల 58 వేల మందికి రూ.10 కోట్లకు పైగా చెల్లించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కేవైసీ ప్రక్రియ, వెరిఫికేషన్ పూర్తి అయింది. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు.