ఇంగ్లీషు కుదుపు : వైసీపీ ఎంపీపై సీఎం జగన్ సీరియస్

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 12:45 AM IST
ఇంగ్లీషు కుదుపు : వైసీపీ ఎంపీపై సీఎం జగన్ సీరియస్

Updated On : November 20, 2019 / 12:45 AM IST

ఇంగ్లీష్ మీడియంపై.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎంపీ కామెంట్స్‌పై.. సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇంగ్లీష్ మీడియంపై.. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ పరమైన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు. రఘురామ కృష్ణంరాజుకు క్లాస్ తీసుకోవాల్సిందిగా.. ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డిని సీఎం జగన్ ఆదేశించారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలపై.. పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చించారు. 

పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై.. ఎంపీ రఘరామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. తెలుగు అకాడమీ నిధుల గురించి మాత్రమే తాను మాట్లాడానని తెలిపారు. ఇంగ్లీష్‌‌కు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది పచ్చి అబద్ధమన్నారు. ఇంగ్లీష్ మీడియంకు తాను వ్యతిరేకం కాదని.. తెలుగు భాష కోసం గత టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాత్రమే చెప్పానన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. తెలుగు అకాడమీని పునరుద్ధరించిందని తెలిపారు. అకాడమీ విభజన ఇంకా పూర్తికాకపోవడంతో.. నిధులు ఆగిపోయాయన్నారు. త్వరగా.. అకాడమీకి నిధులివ్వాలని కోరినట్లు తెలిపారు రఘురామకృష్ణంరాజు. తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ అడిగితే వివరణ ఇస్తానని తెలిపారు ఎంపీ.

ప్రభుత్వ పాఠశాలల్లో.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఏపీలో రాజకీయ దుమారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై.. ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార వైసీపీపై రోజుకో విధంగా విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు.. వైసీపీని కుదిపేశాయి.
Read More : నాన్ బెయిలబుల్ కేసులు, 6నెలలు జైలు : మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు