CM Jagan : సీఎం జగన్ సిమ్లా టూర్… 5 రోజులు వారితోనే

సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లనున్నారు. గురువారం(ఆగస్టు 26,2021) మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. ఒంటి గంటకు గన్నవ

CM Jagan : సీఎం జగన్ సిమ్లా టూర్… 5 రోజులు వారితోనే

Cm Jagan

Updated On : August 25, 2021 / 4:28 PM IST

CM Jagan : నిత్యం పరిపాలన వ్యవహారాలు, రాజకీయ కార్యకలాపాలతో బిజీగా గడిపే సీఎం జగన్ కాస్త రిలాక్స్ అవ్వనున్నారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించనున్నారు. వారితో సంతోషంగా గడపనున్నారు. ఇందుకోసం టూర్ ప్లాన్ చేశారు.

సీఎం జగన్ కుటుంబసమేతంగా సిమ్లా పర్యటనకి వెళ్లనున్నారు. గురువారం(ఆగస్టు 26,2021) మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరతారు. 4 గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకుంటారు. ఆగస్టు 28న జగన్, భారతిల పెళ్లి దినోత్సవం. వారి పెళ్లి అయ్యి 25 ఏళ్లు అవుతుంది. దీన్ని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ ప్లాన్ చేశారు. 5 రోజుల పాటు కుటుంబ సభ్యులతో సీఎం జగన్ గడపనున్నారు. సీఎం సిమ్లా టూర్ కి అధికారులు ఏర్పాట్లు చేశారు.