CM Jagan : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులతో సమావేశమై వారితో మాట్లాడతారు.

CM Jagan : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

Jagan

Updated On : July 26, 2022 / 9:41 AM IST

CM Jagan visit : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులతో సమావేశమై వారితో మాట్లాడతారు. పంట, ఆస్తి నష్టం తెలుసుకుంటారు. ఆ తర్వాత అరిగెలవారిపేట, ఉడిమూడిలంకలో పర్యటిస్తారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి మేకలపాలెం వెళ్లి వరద బాధితుల కష్టాలు తెలుసుకుంటారు. లంక గ్రామాల్లో పర్యటన ముగిశాక సాయంత్రం 4 గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. వరద ప్రభావిత జిల్లాల్లో నష్టం, తీసుకున్న సహాయకచర్యలపై అధికారులతో ఆర్‌ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌లో సమీక్ష చేస్తారు. ఇవాళ రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-నిండుతున్న జలాశయాలు

సీఎం జగన్‌ పర్యటన కోసం గంటి పెదపూడిలో హెలిపాడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ హెలిపాడ్‌ను రవాణాశాఖ మంత్రి పినికే విశ్వరూప్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కోనసీమ జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. మరోవైపు సీఎం పర్యటించనున్న గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.