YS Jagan Kadapa Tour: రేపటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సాఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు.

YS Jagan Kadapa Tour: రేపటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సాఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

YS Janmohan Reddy

YS Jagan Kadapa Tour: వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తారు. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో 23, 24 , 25 తేదీల్లో జగన్ పర్యటన సాగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కడపలో అమీన్‌పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి, వివిధ ప్రైవేట్ కార్యక్రమాలకు జగన్ హాజరవుతారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుడతారు. పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అంతేకాక పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

YS Jagan Birthday: ధైర్యం, పట్టుదలతో లక్ష్యానికి గురిపెట్టి.. ప్రజానేతగా ఎదిగిన జగన్..

23న పర్యటన ఇలా..
23న ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్ పీర్ దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి వెళ్లి గంటపాటు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. 12.50 గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు మాధవి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ కుమాడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 1.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 2.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల వరకు ప్రజలనుద్దేశించే ప్రసంగిస్తారు. అక్కడి నుంచి కమలాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకొని సాయంత్రం 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.

HBD YSJagan: ఏపీ సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెస్

24వ తేదీన పర్యటన ఇలా ..
ఉదయం 9గంటలకు వైఎస్సాఆర్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకుంటారు. 9.40 గంటల వరకు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని 12.15 నుంచి 12. 30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. 5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకొని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్ హౌస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

CM Jagan : ఢిల్లీలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..

25వ తేదీన ..
ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.