AP New Cabinet : ఇదేనా సామాజిక న్యాయం ? – తులసిరెడ్డి

ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి‌రెడ్డి  విమర్శించారు.

AP New Cabinet : ఇదేనా సామాజిక న్యాయం ? – తులసిరెడ్డి

Tulasi Reddy

Updated On : April 11, 2022 / 10:58 AM IST

AP New Cabinet : ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి‌రెడ్డి  విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో కొన్ని కులాల వారికి అసలు ప్రాతినిధ్యమే కల్పించలేదని…ఇదేం సామాజిక  న్యాయమని ఆయన ప్రశ్నించారు.

నూతన మంత్రివర్గంలో మంత్రులు ఉత్సవ విగ్రహాలు‌లా ఉంటారని….విధులు, నిధులు , అధికారాలులేని మంత్రి పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆయన ఈ రోజు కడప జిల్లా వేంపల్లెలో విమర్శించారు. 11మంది పాత వారితో , 14 మంది కొత్త వారితో ఏర్పాటు చేసేందుకు ఇంత తతంగం అవసరమా? మూడూ నెలలు సాము గరిడిలు చేసి మూలనున్న ముసలమ్మ ను కొట్టినట్టుంది ఈ కసరత్తు అని ఆయన సీఎం ను ఎద్దేవా చేశారు.
Also Read : Ap cabinet : దుర్గమ్మను దర్శించుకున్నకారిమూరి, ముత్యాల నాయుడు.. మరికొద్దిసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం
పాత వారిలో 13మందిని ఎందుకు తొలగించినట్లు? వారు అసమర్థులా? అవినీతి పరులా ? అనే విషయం ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని తులసిరెడ్డి  డిమాండ్ చేశారు. 8 జిల్లాలలో ఉన్న వైసీపీ నాయకులు అసమర్ధులను వారికి మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఆయన అన్నారు. వైసీపీ పార్టీలో మొదలైన వాయుగుండం త్వరలో తీరం దాటి సునామీగా మారక తప్పదని తులసిరెడ్డి హెచ్చరించారు.