పవన్ ఎన్నికల శంఖారావం
విజయవాడ : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించాడు. ఈరోజు నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. సభలు, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకి బంగారు భవిష్యత్ ఉండాలి…అందుకోసం జనసేన పని చేస్తుందన్నారు. పవన్ రాజకీయ ప్రవేశంతో ఏపీలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దుతు ఇచ్చారు. కానీ ఈసారి సొంతంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. జనసేనకు ఎన్నికల గుర్తు గ్లాస్ సింబల్ వచ్చిన సంగతి తెలిసిందే.