ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 07:05 PM IST
ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

Updated On : September 13, 2020 / 8:16 PM IST

Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి.



4 లక్షల 67 వేల 139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 66 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4 వేల 912కి చేరాయి.



జిల్లాల వారీగా కేసులు : అనంతపూర్ 521. చిత్తూరులో 957. తూర్పు గోదావరి జిల్లాలో 1414. గుంటూరులో 792. కడపలో 585. కర్నూలులో 441. కృష్ణా లో 397. నెల్లూరులో 844. ప్రకాశం 788. శ్రీకాకుళం 733. విశాఖపట్నంలో 415. విజయనగరంలో 573. పశ్చిమ గోదావరి జిల్లాలో 1076. కేసులు నమోదయ్యాయి.