వదలా బొమ్మాళీ : ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 04:20 PM IST
వదలా బొమ్మాళీ : ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

Updated On : September 13, 2020 / 4:47 PM IST

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. నెలూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యే కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



తనకు పాజిటివ్ వచ్చినట్లు కోటంరెడ్డి వెల్లడించారు. గత వారం రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వారం రోజుల్లో తనను కలిసిన వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తనకు కరోనా నెగటివ్ అనే తేలేవరకు ఎవరూ కలవొద్దని సూచించారు.



ఇక ఏపీలో కరోనా విషయానికి వస్తే..ఉగ్రరూపం దాలుస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. నిత్యం పది వేలకు పైగానే కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు వైరస్ సోకుతోంది.ప్రజాప్రతినిధులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.



గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 9,999 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,47,686 కు చేరింది. కొత్తగా 77 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779 చేరింది. గురువారం నాటికి 44,52,128 టెస్టులు పూర్తయ్యాయి. గురువారం 11,069 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 4,46,716 మంది కోలుకున్నారు.