DGP Rajendranath Reddy : క్రైమ్ రేటు చాలా తగ్గింది.. పోలీసుల పనితీరు భేష్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.

DGP Rajendranath Reddy
Crime Rate Reduced : రాష్ట్రంలో పోలీసులపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు భేష్ గా ఉందన్నారు. కడప అన్నమయ్య జిల్లాలలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 15 శాతం తగ్గిందని చెప్పారు. హత్యలు, అటెంప్ట్ మర్డర్ లు నాలుగు శాతం తగ్గాయని వెల్లడించారు. ఈ మేరకు డీజీపీ కడపలో మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు. మహిళలను ఆరాష్ మెంట్ చేసిన 100 కేసులలో శిక్షలు పడేలా చేశామని చెప్పారు. మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి మహిళలపై జరిగే దాడులను అదుపు చేయగలిగామని తెలిపారు. ఒక లక్ష కేసులను అతి త్వరగా పరిష్కరించామని చెప్పారు.
UPSC Recruitment : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న యూపీఎస్సీ
ప్రకాశం జిల్లాలో జరిగిన అల్లర్లు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సైబర్ క్రైమ్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్ సీఆర్బీ నివేదికల్లో ఎంత మంది మహిళలు మిస్సింగ్ అయ్యారో ఉందని తెలిపారు. ఈ ఏడాది 26 వేల మంది మహిళలు మిస్సింగ్ అయితే 2019 నుంచి మిస్సింగ్ కేసులు కలిపి చూపడం వల్ల ఎక్కువ సంఖ్యలో కనపడుతోందన్నారు.
కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి పనులు మొదలు పెట్టామని తెలిపారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యం అవుతోందన్నారు. ఎస్ఐల రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలవుతోందన్నారు. ప్రమోషన్ల ప్రక్రియ కూడా వేగవంతం చేశామని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్ పై పోలీసులు దృష్టి సారించారని వెల్లడించారు.
అందుకే గంజాయి స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చిందన్నారు. గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ గట్టి చర్యలు చేపట్టిందని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ జరిగే ప్రాంతంలో సప్లై మూలాలలో వెతికి చర్యలు చెపట్టామని పేర్కొన్నారు. ఒరిసా నుంచి ఎక్కువగా గంజాయి వస్తోందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.