ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి

కరోనా కేసులు తగ్గాయనుకున్న లోపే మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పెరిగిపోయాయి.. ర్యాపిడ్ టెస్టులతో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో పీక్ స్టేజ్ దాటేసింది.. ఇక కరోనా కేసులు తగ్గుతున్నాయలే అనుకున్న ఒక్కరోజులోనే మళ్లీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోయింది.
ఏపీలో కరోనా కేసులు మూడు లక్షలు దాటేశాయి.. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోద వుతున్నాయి.. ఏపీలో గత 24 గంటల్లో 56,090 మంది నుంచి కరోనా శాంపిల్స్ తీసుకోగా.. 9,652 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా వల్ల చిత్తూరులో 14 మంది, ప్రకాశంలో పదకొండు మంది, అనంతపూర్ జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కర్నూలులో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, కడపలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటివరకూ ఏపీలో 29,61, 611 శాంపిల్స్ కరోనా కోసం పరీక్షించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో 3,00,41,400 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,6609 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 29,3714 కరోనా కేసులు ఒక్క ఏపీ నుంచే నమోదయ్యాయి. 2461 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి.