Telugu States : మూడు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

Telugu States : మూడు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Telugu States

Updated On : September 27, 2021 / 2:22 PM IST

Cyclone Gulab Update : తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని శాఖలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులకు తెలిపారు.

Read More : Cyclone : వణికిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళంపై గులాబ్ ప్రభావం

అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎస్.వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు అధికారులు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టేలా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి.. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులకు తెలిపారు సీఎస్ సోమేశ్‌ కుమార్‌.

Read More : Viral Fever : హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న వైరల్ ఫీవర్లు.. పాటించాల్సిన జాగ్రత్తలు

తీవ్ర వాయుగుండంగా గులాబ్ ‌తుపాన్ బలహీన పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. చాల చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40- 60 కిమీ వేగంతో ఈదురగాలులు వీయడంతో పాటు..సముద్రం అలజడిగా‌ ఉంటుందని వెల్లడించింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదని, ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా..సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించింది.

High Alert Letter PDF : HIGH ALERT LETTER