Daggubati Purandeswari : ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి- జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఫైర్

సీఎం జగన్, ఆయన అనుచరులు మాత్రమే లబ్ది పొందుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు.

Daggubati Purandeswari : ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి- జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఫైర్

Daggubati Purandeswari Slams CM Jagan (Photo : Facebook)

ఛాన్స్ చిక్కితే చాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ చెలరేగిపోతున్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. ఏపీని అప్పుల ప్రదేశ్ గా మార్చారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.

విజయనగరంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అధికార, అనధికారంగా ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీని అప్పుల ప్రదేశ్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారామె. ముఖ్యమంత్రి జగన్, ఆయన అనుచరులు మాత్రమే లబ్ది పొందుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు.

Also Read : బెయిల్ రద్దుపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

సామాజిక సాధికార యాత్ర చేయటానికి వైసీపీకి ఏ నైతిక హక్కు ఉంది అని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు ఎత్తివేశారని మండిపడ్డారు. రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుంటే జగన్ మాత్రం స్టిక్కర్లు అంటించుకుని కాలం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంను స్టిక్కర్ల ప్రభుత్వంగా నామకరణం చేశామన్నారామె. ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తుంటే వైసీపీ నాయకులు మాపై నిందలు వేస్తున్నారని పురంధేశ్వరి ఫైర్ అయ్యారు.

Also Read : వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ