Pudimadaka Beach: పూడిమడక విషాదం.. గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం..

పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.

Pudimadaka Beach: పూడిమడక విషాదం.. గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం..

Pudimadaka

Updated On : July 30, 2022 / 3:20 PM IST

Pudimadaka Beach: పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో శుక్రవారం అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక సముద్రతీరంలో విహారానికి వెళ్లారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు సముద్ర తీరంలో స్నానాలకు దిగారు. ఆ సమయంలో రాకాసి అల వీరిని లోపలకు లాక్కుపోయింది.

Pudimadaka Beach : పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు..రెండు మృతదేహాలు లభ్యం, మరొకరికి ఆస్పత్రిలో చికిత్స

రక్షించాలని ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని కొన ఊపిరితో ఉండగా కాపాడారు. మరో ఆరుగురిలో గుడివాడ పవన్ సూర్య కుమార్ (19) మృతదేహం శుక్రవారం తీరానికి కొట్టుకొచ్చింది. కాగా మిగిలిన ఐదు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సహాయంతో మిగతా విద్యార్థులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రెండు హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చేపట్టగా నలుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.

Pudimadaka Beach : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

సముద్రంలో నీటిపై తేలియాడుతున్నజగదీష్ (గోపాలపట్నం)‌, గణేష్‌ (మునగ పాక) , రామచందు (ఎలమంచి), సతీశ్‌ (గుంటూరు)ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. మరో విద్యార్థి జశ్వంత్ మృతదేహాన్ని తంతడి తీరంలో గుర్తించారు. గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.