Pawan kalyan : ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంకు డిప్యూటీ సీఎం పవన్.. అక్కడి టెంపుల్ విశిష్ఠత ఇదే.. స్వామిని కిటికీలో నుంచే ఎందుకు చూడాలి..?
Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంకు వెళ్లనున్నారు.
Pawan kalyan
Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మంగళూరులోని ఉడిపికి చేరుకుంటారు. అక్కడ కృష్ణమాత ఆలయంకు వెళ్తారు. కృష్ణమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దేశంలోని నలుమూలల నుండి యాత్రికులు ఇక్కడికి వచ్చి శ్రీ కృష్ణుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో రత్నాలతో అలంకరించబడిన శ్రీకృష్ణుడి మనోహరమైన విగ్రహం ఉంది.
ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో నిరంతరం కృష్ణ నామస్మరణంతో మారుమోగుతుంది. ఎక్కడ చూసినా హరేకృష్ణ హరేకృష్ణ నామస్మరణ వినిపిస్తుంది. ఉడిపి దేవాలయంలో ఓ ప్రత్యేక ఉంది. ఇక్కడి బాలకృష్ణుడి విగ్రహం సింహద్వారం వైపు తిరిగి ఉండదు. కిటికీలో నుంచి మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలా ఎందుకంటే..
కనకదాసు అనే భక్తుడు హరినామ స్మరణ, కృష్ణ నామస్మరణం చేస్తుండేవారు. ఉడిపిలో మడికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అయితే, కనకదాసుకు ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. దీంతో అతను కొద్దిరోజులపాటు వెనుక భాగంలో కిటికీ పక్కన కూర్చొని బాధపడుతూ, ఏడుస్తూ కీర్తనలు పాడుతూ ఉండేవాడు.
ఒకరోజు రాత్రి ఉరుములు, మెరుపులతో భీకర వర్షం కురిసింది. ఆ సమయంలో ఆ విగ్రహం సింహ ద్వారం నుంచి కిటికీ వైపు తిరిగింది. ఎదురున ఉండే గోడకూడ పగిలిపోయి ఉంది. దీంతో ఇక్కడ ఆలయంకు వెళ్లిన భక్తులు బాలకృష్ణుడిని కిటికీలో నుంచి చూసి దర్శించుకోవాలి.. నేరుగా సింహద్వారం నుంచి చూసే, దర్శనం చేసుకునే వీలుండదు.
ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణుడు వజ్రవైడూర్యాలతో నిండుగా అలంకరణతో ఉంటారు. అక్కడ పూజారులు ఉండరు.. మగవ పీఠాదిపతులు పూజలు చేస్తారు. నిత్యం ఉదయం 4గంటల నుంచి రాత్రి 12గంటలకు స్వామికి నివేదన చేస్తారు. అక్కడ గోశాల ఉంటుంది. యాగశాల ఉంటుంది. నిత్యం అన్నదానం జరుగుతుంది.
