Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు

నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం నిర్వహించారు. పటేల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ బయలుదేరారు.

Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు

Ycp

Updated On : June 29, 2022 / 5:12 PM IST

Nandikotkur YCP : నందికొట్కూరు వైసీపీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరుకాలేదు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం నిర్వహించారు. పటేల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ బయలుదేరారు.

Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

వైస్సార్ సర్కిల్ లోని వైస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్థర్ పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి,ప్లీనరీ ఇంచార్జ్ రామసుబ్బారెడ్డి, పరిశీలకుడు కర్ర హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.