దిశ యాప్ తొలి సక్సెస్ : బస్సులో మహిళా అధికారిని వేధించిన వ్యక్తి అరెస్ట్

బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు.

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 09:58 AM IST
దిశ యాప్ తొలి సక్సెస్ : బస్సులో మహిళా అధికారిని వేధించిన వ్యక్తి అరెస్ట్

Updated On : February 11, 2020 / 9:58 AM IST

బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు.

బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు. దిశ యాప్ వచ్చాక తొలి సక్సెస్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తొలి దిశ యాప్ కేసు నమోదైంది. ఎక్సైజ్ శాఖలో ఉన్నత అధికారిణిగా పని చేస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. బస్సులో వెనుక సీట్లో ఉన్న వ్యక్తి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు 7 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి దగ్గరికి చేరుకున్నారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బస్సు విశాఖ నుంచి విజయవాడ వెళ్తోంది. మంగళవారం(ఫిబ్రవరి 11,2020) తెల్లవారుజామున నాలుగున్నరకు దిశ యాప్ ద్వారా SOS కాల్ వెళ్లింది. సమీపంలోని ఎమర్జెన్సీ టీమ్ కు కాల్ సెంటర్ నుంచి సమాచారం వెళ్లింది. నిమిషాల వ్యవధిలో బాధితురాలి దగ్గరికి చేరుకున్న పోలీసులు వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు బసవయ్య నాయక్. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో నాయక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. 

దీనిపై సీఎం జగన్ స్పందించారు. వేగంగా స్పందించి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులను సీఎం జగన్ అభినందించారు. వెల్ డన్ అని కితాబిచ్చారు. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం జగన్ ఇదివరకే హెచ్చరించారు. పక్కా ఆధారాలుంటే.. రేపిస్టులకు దిశ చట్టం కింద 21 రోజుల్లోనే ఉరి శిక్ష విధిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చింది.

* దిశ యాప్ వచ్చాక తొలి సక్సెస్ స్టోరీ
* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దిశ యాప్ ద్వారా తొలి కేసు నమోదు
* బస్సులో మహిళా అధికారికి వేధింపులు
* వేధింపులకు పాల్పడిన బసవయ్య నాయక్ అరెస్ట్

* దిశ SOS ద్వారా బాధితురాలి ఫిర్యాదు
* 7 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి దగ్గరికి చేరుకున్న పోలీసులు
* బసవయ్య నాయక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
* ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో బసవయ్య నాయక్ పై కేసు నమోదు

* విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు
* దిశ యాప్ ద్వారా SOS కి సమాచారం ఇచ్చిన బాధితురాలు
* స్థానిక పోలీసులకు(ఏలూరు త్రీటౌన్) సమాచారం ఇచ్చిన SOS కాల్ సెంటర్
* సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులు బస్సు దగ్గరికి చేరుకున్నారు
* బసవయ్య నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు
* జీరో ఎఫ్ఐఆర్ గా కేసు నమోదు