YSR Pension Kanuka: ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక.. లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేస్తున్న వలంటీర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

YSR Pension Kanuka: ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక.. లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేస్తున్న వలంటీర్లు

YSR Pension Kanuka

YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలంటీర్లు ప్రతీ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందివ్వడం జరిగింది. సెప్టెంబర్ నెలకు గాను 62.53 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1590.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నగదును తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 8గంటల వరకు 31.84శాతం పింఛన్లు పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

YSR Pension Kanuka: ఏపీలో నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక.. 62.70లక్షల మందికి లబ్ధి..

దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతీ నెల 5వ తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వృద్ధులు, ఒంటిరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారి ఇల్ల వద్దకే వెళ్లి పింఛన్ ను వలంటీర్లు అందిస్తున్నారు. ప్రతీయేటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రతీ ఒక్కరికి పెన్షన్ నగదు అందేలా చర్యలు చేపడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2019 సెప్టెంబర్ నెలలో 1,235 కోట్లు అందజేసిన ప్రభుత్వం, 2020 సెప్టెంబర్ నెలలో 1,429కోట్లు, 2021 సెప్టెంబర్ నెలలో 1,397 కోట్లమేర నగదును లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. 2022 సెప్టెంబర్ నెలలో 1,590.50 కోట్లను లబ్ధిదారులకు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు.