YSR Pension Kanuka: ఏపీలో నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక.. 62.70లక్షల మందికి లబ్ధి..

ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1594.66 కోట్లు పంపిణీ చేయనుంది.

YSR Pension Kanuka:  ఏపీలో నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక.. 62.70లక్షల మందికి లబ్ధి..

ysr pension kanuka

YSR Pension Kanuka: ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ పింఛన్లు పంపిణీ చేయనుంది. ఇందుకోసం 1594.66 కోట్ల రూపాయలను గ్రామ వార్డు సచివాలయాలకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. ఐదు రోజుల్లో వంద శాతం పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

YSR Pension Kanuka: లబ్ధిదారులు ఖుషీఖుషీ.. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వలంటీర్లు

గురువారం తెల్లవారు జాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62.69 లక్షల మందికి ఈ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకోసం రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారని మంత్రి తెలిపారు.

YSR Pension Kanuka : వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. జనవరి1 నుంచి రూ.2,500

గురువారం తెల్లవారు జాము నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా ఉదయం 7:30 గంటల వరకు 36.75 శాతం మేర 23.07లక్షల మందికి రూ. 585.58 కోట్లు లబ్ధిదారులకు అంజేయడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.