YSR Pension Kanuka: లబ్ధిదారులు ఖుషీఖుషీ.. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వలంటీర్లు

ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేదీన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుంది.

YSR Pension Kanuka: లబ్ధిదారులు ఖుషీఖుషీ.. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వలంటీర్లు

Ysr Pention

YSR Pension Kanuka: ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేదీన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుంది. ఇప్పటికే పలు పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వలంటీర్లు అందిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కూడా వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి అందిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ బుధవారం తెల్లవారు జామునుంచే వలంటీర్లు పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నగదును అందిస్తున్నారు.

YS Jaganmohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సీఎం జగన్

బుధవారం తెల్లవారు జాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1, 543.80 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7గంటలకు వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు వలంటీర్లు అందజేశారు. 8గంటల వరకు 48.27 శాతం.. 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్లు అందజేసినట్లు ఏపీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. ఉదయం 09:00 గంటల వరకు 58.52 శాతం పెన్షన్ల పంపిణీ చేయగా.. 35.55లక్షల మందికి రూ.902.60 కోట్లు వలంటీర్లు అందచేశారు. ఉదయం 10గంటల వరకు 66.15 శాతంతో 40.18 లక్షల మందికి 1020.68 కోట్ల రూపాయల పెన్షన్లు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు.

AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం పేదవర్గాల ప్రజలకు మేలుచేసేలా అద్భుత సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇంటింటికి రేషన్ కార్యక్రమంతో పాటు, ఇంటింటికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటివద్దకే వచ్చి నగదు అందజేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. పెన్షన్లు అందుకునే వారిలో వృద్ధులే అధికంగా ఉంటారు. వీరు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తీసుకోవాలంటే గతంలో మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటివద్దకు వచ్చి పెన్షన్ డబ్బులు అందిస్తుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.