YCP Eluru: ఏలూరులో వైసీపీ హవా.. 21 డివిజన్లలో వైసీపీ గెలుపు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ముందుంజలో ఉంది.

Ycp
Eluru YCP: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ముందుంజలో ఉంది. మొత్తం 21 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
1వ డివిజన్ ఎ.రాధిక, 2వ డివిజన్ నరసింహారావు, 3వ డివిజన్ అఖిల, 4వ డివిజన్ డింపుల్, 5వ డివిజన్ జయకర్, 12వ డివిజన్ కర్రి శ్రీను, 22వ డివిజన్ సుధీర్‌బాబు, 23వ డివిజన్‌లో సాంబ, 26వ డివిజన్ అద్దంకి హరిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.
అలాగే 31,32,33, 38, 39, 41, 42, 46, 48 డివిజన్లలో వైసీసీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ డివిజన్‌లో బీజేపీ, 15వ డివిజన్‌లో సీపీఐ.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 47 డివిజన్లకు కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15 కాగా.. వైసీపీకి 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 గా ఉంది.