టీడీపీకి వరుస షాక్ లు…వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 06:22 AM IST
టీడీపీకి వరుస షాక్ లు…వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Updated On : March 11, 2020 / 6:22 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధిష్టానికి ఆ పార్టీ నాయకులు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీని వీడారు.
మరి కొందరు వారిబాటలోనే నడువబోతున్నారు. విశాఖలో టీడీపికి మరో షాక్ తగిలింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో యలమంచిలి నుంచి పంచకర్ల పోటీ చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో పంచకర్ల రమేష్ బాబు వరుసుగా మంతనాలు జరిపినట్లు సమాచారం. నేడు జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే డొక్కా, రెహమాన్ వైసీపీలో చేరారు. మరికొందర నేతులు కూడా టీడీపీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.