ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల.. ఎన్ని లక్షల మంది పెరిగారు? మీ ఓటును ఇలా చెక్ చేసుకోండి..

మొత్తం ఓటర్లు: 4,08,07,256... పురుషులు: 2,00,09,275.... మహిళలు: 2,07,37,065... ధర్డ్ జెండర్: 3482...

ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల.. ఎన్ని లక్షల మంది పెరిగారు? మీ ఓటును ఇలా చెక్ చేసుకోండి..

Final Voters List Andhra Pradesh

Updated On : January 22, 2024 / 7:49 PM IST

Voters List: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా విడుదలైంది. ceoandhra.nic.inలో ఈ వివరాలు చూసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ రూపంలో ఓటర్ల జాబితాలను అప్ లోడ్ చేశారు. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందడంతో అందుకు తగ్గట్లు చర్యలు తీసుకున్నారు.

సీఈఓ ఎంకే మీనా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం..

  • మొత్తం ఓటర్లు: 4,08,07,256
  • పురుషులు: 2,00,09,275
  • మహిళలు: 2,07,37,065
  • ధర్డ్ జెండర్: 3482
  • సర్వీస్ ఓటర్లు: 67,434
  • అత్యధిక ఓటర్లు: కర్నూలు జిల్లా: 20,16,396
  • అత్యల్ప ఓటర్లు: అల్లూరి జిల్లా: 7,61,538
  • ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో పెరిగిన ఓటర్ల సంఖ్య
  • సుమారు 5.86 లక్షల మేర పెరిగిన ఓటర్లు
  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు అవకాశం
  • ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా 70 కేసుల నమోదు
  • నెల్లూరు, బాపట్ల, నంద్యాల, అనంతపూర్, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదు
  • తుది జాబితాపై అభ్యంతరాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు
  • స్పెషల్ సెల్ ఇన్‌‌చార్జిగా అదనపు సీఈఓ హరేంధీర ప్రసాద్

ఇలా చెక్ చేసుకోండి

  • https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html కు వెళ్లండి
  • అందులో SSR-2024 కనపడుతుంది.. దానిపై క్లిక్ చేయండి
  • ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో పైన సెర్చ్ యువర్ నేమ్ కనపడుతుంది. అందులోకి వెళ్లండి..
  • మీ పేరు, పుట్టినరోజు వంటి వివరాలు నమోదు చేస్తే మీ ఓటు చూసుకోవచ్చు

ఏపీ సీఈఓ‍ ఎంకే మీనా ఏమన్నారు?

  •  ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారు
  • 18-19 మధ్య వయస్సున్న యువ ఓటర్లు- 8.13 లక్షల మంది ఓటర్లున్నారు
  • యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.. దీనిపై ప్రచారం చేపడతాం
  • ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించాం
  • ఒకే ఇంట్లో పది మందికి పైగా ఓటర్లున్నారనే ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించాం
  • 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి
  • ఈ ఫిర్యాదులను పరిశీలించాం.. 5.64 లక్షల ఓట్లను తొలగించాం
  • ఫాం-7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల పైనా ఫోకస్ పెట్టాం
  • ఓటర్ల జాబితా అవకతవకలకపై ఏపీలో మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయి
  • నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లని నమోదు చేసుకోవచ్చు
  • ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే.. ఆ అభ్యంతరాలను స్వీకరిస్తాం
  • ప్రతి ఓటరు తన పేరుని ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలి
  • ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ విషయంలో ఓ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్ అయ్యారు
  • ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహరం వెనుక ఎవరున్నారోననే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం

 

YCP Fifth List: సీఎం జగన్ క్యాంప్‌ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు