Kanna Lakshminarayana: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయ పరిసరాలు ఆ పార్టీ కార్యకర్తలలో నిండిపోయాయి. స్టేజీపై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

Kanna Lakshminarayana: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana

Updated On : February 23, 2023 / 3:19 PM IST

Kanna Lakshminarayana: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయ పరిసరాలు ఆ పార్టీ కార్యకర్తలలో నిండిపోయాయి. స్టేజీపై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆయనతో వేలాది మంది అభిమానులు వచ్చారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద కూడా టీడీపీ ఫ్లెక్సీలు భారీగా కనపడ్డాయి. మాజీ సీఎంలు ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేత లోకేశ్‌ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో పట్టు ఉంది. నిన్న పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఏపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు.

Krishna SP Jashuava : పట్టాభిని పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం : ఎస్పీ జాషువా