Avinash Reddy : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

Avinash Reddy : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Avinash Reddy

Updated On : April 17, 2023 / 6:38 PM IST

Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం ఉదయం మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే, సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడుతామని తెలిపింది. హైకోర్టులో అవినాష్ రెడ్డి, సీబీఐ తరపు లాయర్లు వాడీ వేడి వాదనలు వినిపించారు.

Dastagiri : అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల నాకు ప్రాణ హాని : వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి

భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అవినాశ్ రెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటీషన్ పెండింగ్ లో ఉండగా అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషన్ పై విచారణ మాత్రమే జరుగుతుంది కదా అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వలేదు కదా అని న్యాయమూర్తి అన్నారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ వెల్లడించారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. దస్తగిరికి బెయిల్ వచ్చిన నెక్స్ట్ డే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారని.. ఆయన్ను అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు.

YS viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కీలక అంశాలు.. వివేకా,సునీతారెడ్డిపై తీవ్ర ఆరోపణలు

హత్యకు సంబంధించిన ఆధారాలు లేవన్నారు. హత్య తరువాత సాక్షాలు తుడిచివేశారని చెపుతున్నారని తెలిపారు. సాక్షాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను ఆరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే దానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు లేవని స్పష్టం చేశారు.
అవినాష్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాడని సీబీఐ వాదనలు వినిపించింది. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజులు సమయం తీసుకుని హాజరయ్యాడని పేర్కొన్నారు.

ఇప్పుడు నోటీస్ ఇస్తే మళ్ళీ పిటిషన్ వేశారని తెలిపారు.  తమ వైపు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చామని తేల్చి చెప్పారు. అవినాష్ పోలీసులకు ఫోన్ చేసి 3-4 కానిస్టేబుల్స్ చాలన్నారని తెలిపారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని పోలీసులకు ఫోన్ చేసింది అవినాశ్ రెడ్డి అని వెల్లడించారు. మర్డర్ ను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారని పేర్కొన్నారు. ఎవిడెన్స్ తారుమారు చేయడంలో అవినాశ్ ది కీలక పాత్ర అన్నారు.