Gold Price Today: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. భారీగా పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

Gold Price Today: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. భారీగా పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold price

Updated On : August 23, 2023 / 7:26 AM IST

Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి వినియోగదారులను ఊరించిన వెండి, బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వీటి ధరలు రెండురోజుల్లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసం సందడి నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు పెళ్ళిళ్ల సీజన్ మొదలైపోయింది. వచ్చే వారం నుంచి లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130కి చేరింది. గత రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై రూ. 100 నుంచి 150 పెరిగింది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే కిలో వెండి రూ. 1500 పెరిగింది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, బుధవారం ఉదయం వరకు రూ. 78,000 చేరింది.

Gold

Gold

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా..

– ఢిల్లీలో బంగారం ధరల్లో నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,200గా ఉంది.
– ముంబైలో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,200 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130గా ఉంది.
– బెంగళూరులోనూ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,200 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,130కి చేరింది.
– చెన్నైలోనూ గోల్డ్ ధరలు పెరిగాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,600 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,560కి చేరింది.

Silver

Silver

భారీగా పెరిగిన వెండి ధరలు..

– వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. కిలో వెండి రూ. 78,000గా ఉంది.
– ఢిల్లీ కిలో వెండి రూ. 1300 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 74,800 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
– చెన్నైలో కిలో వెండి రూ.1300 పెరిగింది. అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 78,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
– బెంగళూరులో కిలో వెండి రూ.1,250 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 73,750 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
– ముంబైలో కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. ప్రస్తుతం అక్కడ కిలో వెండి ధర రూ. 74,800 మార్క్ వద్ద ట్రేడవుతోంది.