Gossip Garage : త్వరలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ? సైకిల్ సవారీకి రెడీ అవుతున్న ఆదిమూలపు సురేశ్..!

ఆయన చేరికపై ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది.

Gossip Garage : త్వరలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ? సైకిల్ సవారీకి రెడీ అవుతున్న ఆదిమూలపు సురేశ్..!

Updated On : January 29, 2025 / 1:03 AM IST

Gossip Garage : అధినేతకు ఆప్తుడు. అధికారంలో ఉన్నప్పుడు నమ్మిన బంటు. బట్‌ పవర్‌ పోయింది. సీన్‌ మారిపోతుంది. సార్‌ సర్దుకుంటున్నారు. సైకిల్‌ సవారీకి ప్లాన్ చేస్తున్నారు. అయితే వన్‌ ఇయర్ బ్యాక్ ఆయన చేసిన ఓవరాక్షన్‌ అంతా కాదు. అదే ఇప్పుడు ఆ నేత పసుపు కండువా కప్పుకునేందుకు అడ్డంకిగా మారుతుందట. ఇంతకీ ఫ్యాన్‌ స్విచ్చాఫ్ చేయాలనుకుంటున్న ఆ నేత ఎవరు? ఆయన టీడీపీలో చేరడం ఖాయమా?

జగన్‌ కోటరీగా పేరున్న నేతలు వైసీపీకి గుడ్‌బై..
ఫ్యాన్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. అధినేతకు ఆప్తులు, సన్నిహితులుగా, జగన్‌ కోటరీగా, నమ్మిన బంటుగా పేరున్న నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ఎపిసోడ్‌ మరవక ముందే ఇప్పుడు మరో మాజీమంత్రి ఫ్యాన్ పార్టీ విడిచేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

టీడీపీలోని తన సామాజిక వర్గం నేతలతో లాబీయింగ్..
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్..టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న ఆదిమూలపు సురేష్..టీడీపీలోని తన సామాజిక వర్గం నేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా సైకిల్ సవారీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట ఆదిమూలపు సురేష్.

Also Read : పెద్ద ఎత్తున ఆ డ్రింక్స్ ను రీకాల్ చేసిన కోకాకోలా.. అందులో ఏముందో తెలిస్తే షాకే..!
ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలతో రాయబారాలు నడుపుతున్న ఆదిమూలపు సురేష్..ఆల్మోస్ట్‌ సైకిల్ పార్టీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే జగన్ తీరు నచ్చకే ఆదిమూలపు జంపింగ్‌ బాట పడుతున్నారట. గత నాలుగు పర్యాయాలు ఎన్నికల బరిలో..ఒక్కోసారి ఒక్కో చోటు నుంచి పోటీ చేశారు ఆదిమూలపు.

జగన్ వైఖరిపై అసంతృప్తి..
తనకు ఇష్టం లేకపోయినా నియోజకవర్గాలు మార్చి జగన్ బరిలో దింపడంపై అసంతృప్తిలో ఉన్నారట మాజీ మంత్రి. వైసీపీ భవిష్యత్తు, అధ్యక్షుడి పొలిటికల్ వ్యవహార శైలిపై ఆందోళన చెందుతున్న ఆదిమూలపు సురేష్..ఇక టీడీపీలోకి వెళ్లడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారట. అందుకోసం ఓ రేంజ్‌లో లాబీయింగ్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన సమయంలో ఆదిమూలపు సురేష్‌ ఓవరాక్షన్ చేశారంటూ గుర్తు చేస్తున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనగా సందర్భంగా.. అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడుల వరకు వెళ్లింది వ్యవహారం.

చొక్కా విప్పి అర్ధనగ్నంగా హల్‌చల్ చేశారు..
అయితే క్యాడర్ గొడవ అలా ఉంటే.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్ మీడియా ముందు చొక్కా విప్పి అర్ధనగ్నంగా హల్‌చల్ చేశారు. అంతేకాదు చంద్రబాబు, టీడీపీ నేతకు సవాల్‌ చేస్తూ రెచ్చిపోయారు. పైగా బాబు సభకు జనం రాకపోవడంతోనే గొడవలు సృష్టించారని రివర్స్‌ గేర్ వేశారు.

Also Read : పులి యూరిన్ అమ్ముతున్న జూ.. బాటిల్ రూ.596 అట.. ఆ రోగం తగ్గుతుందని ప్రచారం చేసి..

చంద్రబాబు, లోకేశ్‌ దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని.. క్షమాపణ చెప్పాలని గగ్గోలు చేశారు. దాడుల విషయంలో కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దామంటూ సవాల్ చేశారు. ఇలా అప్పుడు ఆదిమూలపు అతి చేశారని కొందరు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి నేతను ఎలా చేర్చుకుంటారనే వాళ్లు ఉన్నారు. అయితే రాజకీయాలు అన్నాక ఏదైనా జరగొచ్చు.

క్యాడర్‌, లీడర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..
ఒకవేళ ఆదిమూలపు సురేష్‌ను టీడీపీలో చేర్చుకుంటే రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రువులు ఉండరన్నది మరోసారి ప్రూవ్‌ కానుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి బదిలీపై వచ్చి పోటీ చేశారు ఆదిమూలపు. ఆయన చేరికపై ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. ఆదిమూలపును చేర్చుకోవడానికి టీడీపీ అధిష్టానం ఓకే చెప్తే..క్యాడర్‌, లీడర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి మరి.