Gossip Garage : నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?

మంచి నామినేటెడ్‌ పోస్ట్‌ ఇచ్చి సంతృప్తి పరచాలని..భవిష్యత్‌లో ఇంకా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

Gossip Garage : నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?

Updated On : November 10, 2024 / 1:10 AM IST

Gossip Garage : పార్టీ గొంతై వినిపించామ్. ఐదేళ్లు అపోజిషన్‌లో పోరాడాం. చివరకు పొత్తులు వస్తే సీటు త్యాగం చేశాం. అయినా ఇప్పటివరకు ఓ పోస్ట్ ఇవ్వడం లేదు. అన్నా మీకెప్పుడు పదవి వస్తుందంటూ క్యాడర్‌ మ్యూజిక్‌ వాయిస్తుంది సార్‌ అంటూ..పదవుల కోసం ఎదురు చూస్తున్నారట నేతలు. కూటమి పార్టీల్లో చాలామంది లీడర్లు పదవుల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. టీడీపీ లీడర్లు అయితే బాస్‌ ఎప్పుడు కనికరిస్తారోనని మధన పడుతున్నారట. రెండు విడతల్లో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అయిపోయింది. పోస్టులు ఈన్నీ ఫిలప్‌ అయిపోయాయి. ఇక అదృష్టం ఎప్పుడు తమ తలుపు తడుతుందోనని ఊహల్లో తేలియాడిపోతున్నారట. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు.? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు.?

ఇంకా కొందరు నేతలకు మాత్రం పదవుల రేసులో వెయిటింగ్ తప్పడం లేదట..
ప్రభుత్వం వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యామ్. టంపింగ్‌ మెజార్టీతో గెలిచాం..జోష్‌ మీదున్నాం. కానీ మాకు పదవేది సార్. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. మీడియాలో గొంతు చించుకుని అరిచాం. సీటు ఇవ్వలేమంటే అర్థం చేసుకున్నామ్. మాకెప్పుడు సార్ పదవి యోగం దక్కేది అంటూ..ఏపీలో టీడీపీ నేతలు వేయి కళ్లలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేపట్టింది కూటమి సర్కార్. ఇందులో టీడీపీ నేతలకు పెద్ద సంఖ్యలోనే పదవులు వచ్చాయి. అయితే ఇంకా కొందరు నేతలకు మాత్రం పదవుల రేసులో వెయిటింగ్ తప్పడం లేదట.

టీడీపీ అధినేతకు వడపోత కష్టంగా మారిందట..
రెండో లిస్ట్‌లో తమ పేరు ఉంటుందని చాలామంది నేతలు భావించారు. కానీ టీడీపీ అంటే టక్కున గుర్తొచ్చే నేతల పేర్లు రెండో జాబితా నామినేటెడ్‌ పోస్టుల లిస్ట్‌లో కనిపించలేదు. బుద్దా వెంకన్న, జలీల్‌ ఖాన్, పరిటాల శ్రీరామ్‌, ఏవీ సుబ్బారెడ్డి, పట్టాభి ఇలా చాలామంది నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే సెకండ్‌ లిస్ట్‌లో తమ పేరు లేకపోవడంతో నిరాశ చెందారట. ఇప్పటివరకు భర్తీ అయిన వాటిలో లోకల్ డెవలప్‌మెంట్ అథారిటీలు, చిన్న చిన్న కార్పొరేషన్‌ పదవులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పెద్ద పోస్టులు ఖాళీగా ఉన్నాయని..కాకపోతే..చాలామంది నేతలు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండటంతో..ఎవరికి ఏ పోస్ట్ ఇచ్చి సంతృప్తి పరచాలో అధిష్టానానికి అంతుచిక్కడం లేదంటున్నారు. సీట్లు త్యాగం చేసిన నేతలు కొందరు అయితే.. పార్టీ కోసం గత ఐదేళ్లు తీవ్రంగా కష్టపడిన లీడర్లు ఇంకొందరు ఉండటంతో..టీడీపీ అధినేతకు వడపోత కష్టంగా మారిందట.

ఎమ్మెల్సీ పదవి అయితేనే తీసుకుంటామంటున్నారట…
మాజీమంత్రి దేవినేని ఉమాతో పాటు..కాపు నేత వంగవీటి రాధా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కల్యాణ్‌ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ కూడా ఎమ్మెల్సీ బెర్త్ కోసమే పట్టుబడుతున్నారట. బుద్దా వెంకన్నకు నామినేటెడ్‌ పోస్ట్‌ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉన్నా..ఆయన మండలికి వెళ్లాలని మంకు పట్టుతో ఉన్నట్లు టాక్. ఇక మహాసేన రాజేశ్, మంతెన సత్యనారాయణ, బీద రవిచంద్ర, బీటెక్ రవి, ప్రభాకర్‌ చౌదరి ఇలా ఇంకో నలుగురైదుగురు నేతలు ఎమ్మెల్సీ పదవి అయితేనే తీసుకుంటామంటున్నారట.

భవిష్యత్‌లో ఇంకా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్..
నామినేటెడ్‌ పోస్ట్‌ ఇస్తామంటే ఎమ్మెల్సీ కావాలంటారు. అంతమందికి ఎమ్మెల్సీలు ఎలా ఇవ్వగలుగుతాం అంటూ..నేతల తీరుపై చంద్రబాబు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సెకండ్‌ లిస్ట్‌లో చెప్పుకోదగ్గ నేతల పేర్లు లేనట్లు చెబుతున్నారు. నామినేటెడ్‌, ఎమ్మెల్సీ పదవుల రేసును తేల్చలేకే ఇన్నాళ్లు.. ఛైర్మన్ పదవుల భర్తీ ఆలస్యం అయిందని అంటున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతలతో మాట్లాడి వ్యవహారం కొలిక్కి తేవాలని బాబు భావిస్తున్నారట. మంచి నామినేటెడ్‌ పోస్ట్‌ ఇచ్చి సంతృప్తి పరచాలని..భవిష్యత్‌లో ఇంకా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక నామినేటెడ్‌ పోస్ట్‌లు తీసుకోనంటున్న నేతలకు కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందరికీ ఎమ్మెల్సీలు ఇవ్వడం కుదరదని..మీ రాజకీయ భవిష్యత్‌కు నాది భరోసా అంటూ బాబు సర్ధిచెప్పబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలా ఎమ్మెల్సీ పదవులపై నేతలకు క్లారిటీ ఇచ్చిన తర్వాత..ఇక పూర్తిస్థాయిలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపడతారని తెలుస్తోంది.

Also Read : ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల.. నైతిక విలువ‌ల స‌ల‌హాదారుగా చాగంటి..